గురుగ్రహ సంచారం..ఈ 3 రాశుల వారు ఏప్రిల్ 30 వరకు పట్టిందల్లా బంగారమే..!
గురు గ్రహం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. గురు గ్రహం ఏప్రిల్ వరకు మేషరాశిలో సంచరిస్తాడు. ఇది కొన్ని రాశులకు అపారమైన ప్రయోజనాన్ని ఇవ్వనుంది. 2023 లో గురు గ్రహం మేషరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ఇది ఇప్పటికీ ఈ రాశిలో కదులుతోంది.
గురు సంచారం 2023 ఏప్రిల్ 22 శనివారం ఉదయం 06:12 గంటలకు మేషరాశిలో ప్రారంభం అయింది. 2024 లో గురు గ్రహం ఏప్రిల్ వరకు మేష రాశిలో సంచరిస్తాడు కాబట్టి.. త్వరలో గురు గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో..మేష రాశిలో గురు గ్రహం ఉండటం వల్ల ఏయే రాశుల వారికి అదృష్టం కలుగుతుందో చూద్దాం.
సింహ రాశి:
సింహ రాశి వారికి గురు సంచారం ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. వ్యాపార రంగంలో విదేశీ వ్యవహారాలు పొందటం జరుగుతుంది. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న సమస్యలు క్రమంగా సమసిపోనున్నాయి. గురు గ్రహం శుభ ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడనుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొననుంది.
కన్యారాశి:
ఈ రాశి వారికి గురు గ్రహం సంచారం చాలా మేలు చేస్తుంది. ఆగిపోయిన మీ పనిని తిరిగి చేయడం ప్రారంభించటం జరుగుతుంది.కెరీర్ లో ప్రమోషన్ పొందాలంటే ఎన్నో ముఖ్యమైన ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. మీరు సుభిక్షంగా ఉండటమే కాదు పని పరంగా విదేశీ ప్రయాణాలు చేస్తారు. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకొనున్నారు.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి గురు సంచారం శుభాన్ని తీసుకురానుంది. మీ ఆర్థిక పరిస్థితి ముందుగానే మెరుగుపడనుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీ బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయాలి. ఇదే సమయంలో మీరు ఒక కొత్త పని ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితం కూడా చాలా మధురంగా ఉంటుంది.