ఏపీలో పండుగపూట విషాదం..2 బస్సులు ఢీ..!
ఆంధ్రప్రదేశ్ లో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. 2 బస్సులు ఢీ కొన్నాయి. ఈ సంఘటన వివరాల్లోకెళ్తే..
శ్రీకాకుళం జిల్లా పలాస బైపాస్ రోడ్డు లో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.2 ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొన్నాయి. ముందున్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది ఓ ట్రావెల్స్ బస్సు దీంతో..క్లీనర్ దినేష్ (25 ) మృతి చెందాడు.మరో 20 మంది టూరిస్టులకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అలర్ట్ అయిన స్థానికులు, పోలీసులు… క్షత గాత్రులను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్ నుంచి పూరి, రామేశ్వరం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.ఈ సమయంలో 54 మంది బస్సులో ప్రయానిస్తున్నట్లు సమాచారం. ముందు బస్సులోని ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నారని…కేవలం వెనుక ఉన్న ట్రావెల్స్ బస్సు ప్రయాణికులకు గాయాలు అయినట్లు పోలీసులు చెప్తున్నారు.