జపాన్ లో పెను భూకంపం..అక్కడ జక్కన్న సేఫ్ గానే ఉన్నాడా..?
టాలీవుడ్ ప్రముఖ ఎస్ఎస్ రాజమౌళి కి(SS Rajamouli) భారీ ప్రమాదం తప్పింది. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యారు.ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చి 3 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ సినిమాను జపాన్(Japan) లో విడుదల చేయగా విజయవంతంగా ఏడాదిన్నర గా థియేటర్ లలో నడుస్తోంది.
ఇందులో భాగంగా అక్కడ థియేటర్లలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో పాల్గొనేందుకు వెళ్లారు జక్కన్న. అక్కడ రాజమౌళి భారీ ప్రమాదం (Accident) నుంచి బయట పడ్డారు.
జపాన్(Japan) లో భూకంపం(Earthquake) బారి నుంచి తృటిలో తప్పించుకున్నారు జక్కన్న. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కార్తీకేయ ఎక్స్ ద్వారా తెలియజేశారు. తాము ఓ బిల్డింగ్ లో 28 వ అంతస్తులో ఉన్న సమయంలో మెల్లగా భూమి కంపించడం మొదలైందని ట్విటర్ లో పేర్కొన్నారు కార్తీకేయ.జపాన్ లో భూకంపం ఎలా ఉంటుందో అనేది మేం ఇప్పుడే చూశాం అంటూ రాజమౌళి కుమారుడు కార్తికేయ(Karthikeya) చెప్పుకొచ్చాడు. మేం టెన్షన్ పడ్డాం కానీ, జపనీయులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందలేదని అన్నారు.
జపాన్(Japan) లో వారంతా ఏదో వానజల్లు పడుతున్నంత తెలికగా తీసుకున్నారు… మేము మాత్రం మొత్తానికి భూకంపం దెబ్బకు చాలా భయపడ్డామని కార్తికేయ ట్విటర్(X) లో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ఏమి కాలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు.ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబు తో ఎస్ఎస్ ఎంబీ 29 సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం సినిమాకి సంబంధించిన రైటింగ్ పనులు పూర్తయినట్లు రాజమౌళి తెలిపారు.
Felt a freaking earthquake in Japan just now!!!
Was on the 28th floor and slowly the ground started to move and took us a while to realise it was an earthquake. I was just about to panic but all the Japanese around did not budge as if it just started to rain!! 😅😅😅😅😅… pic.twitter.com/7rXhrWSx3D— S S Karthikeya (@ssk1122) March 21, 2024