కరెన్సీ నోట్లపై శ్రీరాముడి బొమ్మ..ఇది ఎంతవరకు నిజం..?
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో ఈనెల 22న వైభవంగా శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రంలో పాల్గొనున్నారు. అయితే అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నెట్టింట ఓ వార్త దేశంలో హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.500ల కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ స్థానంలో శ్రీరాముడి చిత్రాన్ని ముద్రించినట్లుగా రూ.500ల నోటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఆ నోటుపై ఎర్రకోట స్థానంలో అయోధ్య రామ మందిరం, స్వచ్ఛ భారత్ లోగో స్థానంలో రామబాణం ముద్రించినట్లుగా కనిపిస్తోంది. కానీ, కొత్త నోటు ముద్రించడంపై ఇప్పటి వరకు ఆర్బీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 1996లో కరెన్సీ నోట్లపై అశోకుడి స్థూపం స్థానంలో మహాత్మా గాంధీ సిరీస్ను ఆర్బీఐ ప్రచురించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి భారత కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రమే ఉంది. ఈ విషయంలో ఆర్బీఐని సంప్రదించగా అలాంటిదేమీ లేదని ఈ ఫోటోలు బూటకమని కొట్టిపడేసింది.