Tata Punch EV ఇంటీరియర్ చూస్తే షాక్..ఫొటోలు వైరల్..!
టాటా పంచ్ ఈవీ త్వరలో ఇండియా మార్కెట్లో విడుదల కానుంది. ఇప్పటికే టాటా నుంచి టాటా టియాగో ఈవీ, టాటా నెక్షాన్ ఈవీలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా టాటా పంచ్ ఈవీ ద్వారా ఈవీ మార్కెట్లో సత్తా చాటేందుకు టాటా సిద్ధం అయ్యింది..
టాటా పంచ్ ఈవీ తాజాగా డీలర్‌షిప్‌కు చేరింది. ఈ కారు ఇంటీరియర్ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. సాధారణ టాటా పంచ్ వాహనంతో పోలిస్తే.. పంచ్ ఈవీ లోపలి భాగంలో అనేక మార్పులను చూడచ్చు..దీనికి టెక్నాలజీ పరంగా మెరుగైన ఫీచర్లు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. టాటా నెక్సాన్ ఈవీలో ఉన్న అనేక ఫీచర్లు పంచ్ ఈవీలో కూడా ఉన్నాయి.
టాటా పంచ్ ఈవీ 10.2 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి.. దీంతోపాటు 10.2 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌ను పొంది ఉంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు ఆర్కేడ్ ఈవీ సూట్లను సపోర్టు చేస్తుంది. పంచ్ ఈవీ 2-స్పోక్ స్టీరింగ్ వీల్.. నెక్సాన్ ఈవీకి ఇల్యూమినేటెడ్ లోగోను కలిగి ఉంటుంది. టచ్ అండ్ టోగుల్ హెచ్వీసీ కంట్రోల్‌తో కొత్త సెంటర్ కన్సోల్ కలిగి ఉంది.టియాగో, టిగోర్ పోలిస్తే ఇవి గణనీయమైన అప్‌గ్రేడ్‌గా అనుకోవచ్చు..దీంతోపాటు టాటా పంచ్ ఈవీ డిస్క్ బ్రేక్‌లను కూడా కలిగి ఉంది. టాటా స్టాండర్డ్ పంచ్ ఈవీ.. లాంగ్ రేంజ్ బ్యాటరీ ఆప్షన్‌ను కలిగి ఉంది. 3.3kW ఏసీ ఛార్జర్ లేక ఫాస్ట్ 7kW ఏసీ ఛార్జర్లు ఉన్నాయి.
టాటా పంచ్ ఈవీ ఛార్జింగ్ పోర్టు ముందు భాగంలో ఉంది. ఇది సైడ్ పోర్ట్ కంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మరియు Acti.ev ప్లాట్‌ఫాంపై రూపొందించబడింది. పంచ్ ఈవీ ఆఫ్ రోడ్ సామర్థ్యాలను పరీక్షించే వీడియోలను టాటా సంస్థ తాజాగా విడుదల చేసింది. కఠినమైన రోడ్లపై ఎంతో సునాయాసంగా ప్రయాణించడం గమనించవచ్చు.
టాటా పంచ్ ఈవీ లోపలి భాగం డ్యూయల్ టోన్ అప్హోల్స్టరీ, AQS డిస్ప్లేతో కూడిన ఎయిర్ ఫ్యూరిఫైయర్ కూడా ఉన్నాయ్. ఆటో ఫోల్డ్ ORVM, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, సన్‌రూఫ్ కూడా ఉంది.దీంతోపాటు క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, 6-ఎయిర్ బ్యాగ్‌లను కలిగి ఉంది. ఈ టాటా పంచ్ ఈవీ 300 కి.మీ రేంజ్ మరియు 600 కి.మీ రేంజ్ అందిస్తాయని తెలుస్తోంది. టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ.12 లక్షలు (ఎక్స్‌షోరూం). అదే హైఎండ్ మోడల్ రూ.14 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉండనుంది..