సుశాంత్‌సింగ్ కేసులో నాగిన్ డ్యాన్స్ చేసిన రియా చక్రవర్తి..!
హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య సినీ పరిశ్రమని కుదిపేసింది. ఈ కేసులో పోలీసులు సుశాంత్ లవర్, నటి రియా చక్రవర్తిని కూడా అరెస్ట్ చేశారు.తను నెలరోజులు జైలుశిక్ష అనుభవించింది. ఆ చేదు అనుభవాల్ని ప్రముఖ రచయిత చేతన్ భగత్ టాక్‌షోలో మాట్లాడిందామే.
‘జైలులో ఎక్కువగా రోటీ, క్యాప్సికం కూర పెట్టేవాళ్లట. పేరుకే అది కూర గానీ నీళ్లలా ఉండేదని చెప్పుకొచ్చింది రియా.అయినా బాగా ఆకలిగా ఉండటంతో తినేసేదాన్నని.. ఇక నేను పడుకునే పక్కనే టాయిలెట్ ఉండేదని.. ఇలాంటివి ఎన్నో పరిస్థితులు ఎదురైనట్లు చెప్పింది. కానీ..ఆ సమయంలో పడిన శారీరక బాధలకన్నా.. అనుభవించిన మానసిక క్షోభే ఎక్కువగా ఉండేదని చెప్పింది రియా. అయినా ఒక్కోసారి మిగతా ఖైదీలతో పోలిస్తే నా పరిస్థితి బాగానే ఉంది అనిపించేదని.. కొందరికి బెయిల్ దొరికినా రూ.5వేలు, రూ.10వేలు కట్టలేక బయటికి వెళ్లలేకపోయేవారని, నాకు బెయిల్ వచ్చినప్పుడు ‘మీరు హీరోయిన్ కదా.. మీ సంతోషాన్ని డ్యాన్స్ రూపంలో చెప్పండి’ అన్నారు కొందరు దీంతో.. నేను వెంటనే ‘నాగిన్ గిన్ గిన్..’ పాటకి డ్యాన్స్ చేశాను’ అంటూ రియా చక్రవర్తి తన అనుభవాలు గుర్తు చేసుకున్నారు.