రియల్ స్టోరీ: బిక్షమెత్తుకునే స్థాయి నుండి జిల్లా ఎస్పీ స్థాయికి..!
మట్టిలో మాణిక్యం అతను..ఊహకందనంత దుర్భలమైన జీవితం అనుభవించి ఇప్పుడు అందరు గర్వించే స్థాయికి వచ్చాడు ఇతను. ఇతనే అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీ హనుమంతరావు. అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీ హనుమంతరావు సక్సెస్ జర్నీ చూస్తే ఒకపక్క ఆనందం.. మరోపక్క కన్నీళ్లు ఆగవు..
ఇది కథ కాదు..సినిమా అంతకన్నా కాదు..ఇది నిజ జీవితంలో జరిగిన ఓ యదార్ధ సంఘటన. ఓ చిన్న పిల్లవాడు బిక్షాటన చేసి చదువుకుని అడిషనల్ ఎస్పీ స్థాయికి ఎదిగిన స్ఫూర్తివంతమైన నిజం ఇది. ఈ అడిషనల్ ఎస్పీ జీవితం భావితరాల యువతకు ఎంతో స్ఫూర్తి ఇవ్వనుంది.
స్మశానవాటికలో సమాధులకు గుంతలు తవ్వి..!
అన్నం కోసం బిచ్చమెత్తుకుంటూ.. ఇళ్లలో తీసేసిన బట్టలు అడిగి తెచ్చుకున్నారు ఈయన. పగిలిన పలక ఎవరో ఇస్తే తీసుకుని..ఇంకెవరో దానం చేసిన బట్టలు వేసుకుని స్కూల్ ముందు నిలబడితే.. అప్పుడు స్కూల్లో చేర్చుకున్నారు ఇతన్ని. అంతటితో కష్టాలు తీరలేదు ఈయనకు.. అడుక్కు తినేవాడు మా పక్కన కూర్చుకుని చదువుకోవడం ఏంటని అక్కడా వివక్ష ఎదుర్కొన్నాడు ఈ మహానుభావుడు. ఇల్లు ఇల్లు తిరిగి బిచ్చమెత్తుకుని.. స్మశానవాటికలో సమాధులకు గుంతలు తవ్వి కష్టపడి చదువుకున్న ఆ పిల్లవాడు ఇవాళ అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీ స్థాయికి ఎదిగాడంటే నమ్మగలరా..?
ఆకలి తట్టుకోలేక.. తల్లి, కొడుకు ఇద్దరూ బిక్షాటన..!
పాపం ఆకలి తట్టుకోలేక తల్లి, కొడుకు ఇద్దరూ ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేసే వారు. తోటి పిల్లలు స్కూల్ కి వెళ్ళడం చూసి..ఆ పిల్లవాడు స్కూల్‌కి వెళ్లి చదువుకోవాలనుకున్నా..అడుక్కోడానికి వచ్చాడనుకుని స్కూల్ నుంచి బయటకు పంపించారు టీచర్లు. ఎందుకంటే ఆ పిల్లవాడి ఒంటి మీద బట్టలు మాసిపోయి ఉండటమే కారణం..అందుకే స్కూల్లో చేర్చుకోలేదు. ఎలాగైనా స్కూల్‌కి వెళ్లి చదువుకోవాలి అన్న పట్టదల ఆ పిల్లాడి ఒంటి మీద మాసిన బట్టలు ఆపలేక పోయాయ్. చదువుకు ఉన్న గొప్పతనం ఏంటో తన జీవితమే ఒక ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు అడిషనల్ ఎస్పీ హనుమంతరావు.
అలాగే చదువుకుంటే తప్ప భవిష్యత్ లేదని గ్రహించిన ఆ పిల్లవాడు..బిక్షాటన చేసుకుని కడుపునింపుకునే తాను.. ఇవాళ ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. చదువుకు ఉన్న గొప్పతనం ఏంటో తన జీవితమే ఒక ఉదాహరణ అన్నారు అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీ హనుమంతరావు. చదువుకుంటే తప్ప భవిష్యత్ లేదని గ్రహించి.. బిక్షాటన చేసుకుని కడుపునింపుకునే ఇతను.. ఇవాళ ఈ స్థాయికి వచ్చానని గర్వంగా చెప్పుకుంటున్నారు. తాను చదువుకోవడం వల్లే ఇంటింటికీ తిరిగి అడుక్కున్న తన తల్లిని ఇవాళ గౌరవిస్తున్నారన్నారని అడిషనల్ ఎస్పీ హనుమంతరావు అన్నారు.
ఇతని యదార్థ ఘటన చూసి అందరి కళ్ళలో నీళ్ళు..!
ఉన్నత స్థాయి పోలీసు అధికారి తాను బిక్షాటన చేసే వాడిని అని వందల మంది ముందు చెప్పడానికి ఏమాత్రం సిగ్గు, మొహమాటం లేదు. ఎందుకంటే ఆ కష్టాల వెనకాల ఓ 10 మంది పిల్లలు మారాలి అనేదే తన ఆలోచన. తన జీవన పోరాటం అందరి కళ్ళలో నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ జీవిత ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం స్ఫూర్తిదాయకం..