జనగళం సభలో వారిపై ప్రధాని మోదీ ఆగ్రహం..!
ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో మరింత హీట్ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఏపిలో పర్యటిస్తున్నారు.చిలుకలూరి పేటలో నిర్వహించి ప్రజాగళం సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధాని మోదీ. ఈ సభలో వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు సీనియర్ నేతలు పాల్గొంటున్నారు.
కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ సభ ప్రాంగణానికి చేరుకుని వేదికపై కూర్చున్నారు. సభ ప్రాంగాణం జనసంద్రంలా జయ జయ నాధాలతో మారు మ్రోగింది. అయితే సభకు హాజరైన కొంత మంది కార్యకర్తలు టవర్స్‌పై, సభలో ఫ్లడ్‌లైట్ల కటౌట్లపై సైతం కార్యకర్తలు ఎక్కడం తో మోదీ వారిపై ఆగ్రహించారు.
వారిని చూసిన ప్రధాని మోడీ వెంటనే కిందకు దిగాలని అభ్యర్థించారు. దీంతో వేదికపై ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు సైతం వారిని కిందిగి దిగాలని కోరారు. ఏదైనా ప్రమాదం ఉంటుందని, కార్యకర్తలు సంయమనం పాటించాలని ప్రధాని మోడీ అన్నారు. కార్యకర్తలను కిందకు దిగాలని స్వయంగా మోడీ కోరడం ఈ సభలో ఆసక్తికరంగా మారింది. అక్కడున్న టవర్‌పై ఎక్కిన కార్యకర్తలు వెంటనే దిగాలని, మీకేదైనా అయితే తట్టుకోలేమని మోడీ కోరడంతో వారు కిందకు దిగారు.