నందమూరి బాలకృష్ణతో ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమా ఫిక్స్..?
ఎస్..ప్రెజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్.. ప్రశాంత్ వర్మకు జాక్పాట్ ఆఫర్ అందిందట..అవును.. ఇది నిజం. హనుమాన్ సినిమాతో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ వర్మ తన రాబోయే సినిమాకు బాలయ్యతో కమిట్ అయ్యాడట..ప్రస్తుతం ఇదే న్యూస్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది.
బాలయ్య లాంటి స్టార్ హీరో ప్రశాంత్ వర్మకు ఆఫర్ ఇవ్వడం అంటే ఆషా మాషీ విషయం కాదు. కానీ హనుమాన్ సినిమా చూసి ఇంప్రెస్ అయిన బాలయ్య ఆయనకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారని టాక్.
హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రాన్ని పూర్తి చేయడానికి సమయం కేటాయిస్తాడని అనుకున్నారు. కానీ ఆ సినిమా కన్నా ముందే బాలయ్యతో మరో సినిమాను తెరకెక్కించబోతున్నారట ప్రశాంత్. ఇది ఫుల్ బాలయ్య అభిమానులకి నచ్చే విధంగా ఉంటుందట. అంతేకాదు బాలయ్య కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన భైరవద్వీపం – ఆదిత్య 369 లాంటి జూనర్ లో రాబోయే సినిమా తెరకెక్కబోతుంది.
అంతేకాదు ఇప్పటికే అన్ స్టాపబుల్ కి సంబంధించి ప్రశాంత్ వర్మ బాలయ్యను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.ఇందులో ఎపిసోడ్స్ అందరిని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ బాలయ్య కాంబినేషన్లో సినిమా అంటే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయట. గుంటూరు కారానికి ఒకరోజు ముందు రిలీజైన తేజ సజ్జ-ప్రశాంత్ వర్మల సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమా ‘హనుమాన్’ పాన్ ఇండియాగా రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టకపోయినా సినిమాపై పాజిటివ్ టాక్ బాగా వచ్చింది.
‘హనుమాన్’ మూవీకి నైజాంలో రూ. 7.15 కోట్లు, సీడెడ్లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 9.50 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 20.65 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్లో రూ. 4 కోట్లు, వేరే భాషల్లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 29.65 కోట్లు బిజినెస్ అయింది.