కండువా మార్చనున్న ఎంపీ రఘురామ..!
ఏపీ రాజకీయాలపై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు..టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ కూడా భాగస్వామిగా చేరే అవకాశాలు ఉన్నాయని రఘురామ అన్నారు..ఎందుకంటే జనసేన బీజేపీ పొత్తులతో ఉంన్నాయని..అలా భావించకపోతే రాజకీయంగా బుద్ధిహీనులే అవుతారని, ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు..
పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానాన్ని కోరుకునే పార్టీలో రఘురామ చేరానున్నట్లు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 2వ వారంలో వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించిన రఘురామ రాజు..ఒక రాజీనామా మరొక ఎన్నికకు మార్గం సుగమం చేస్తుందని తెలియజేశారు…
రాబోవు ఈ ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానానికి టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు రఘురామ. గత 4సంవత్సరాలుగా తనపై ఎన్నో అక్రమ కేసులను నమోదు చేశారని రఘురామకృష్ణ అన్నారు. తనపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలియజేయాలని న్యాయస్థానాన్ని కోరగా..తనపై 16-17 కేసులు ఉన్నట్టు లెక్క చెప్పారని, అన్నింటిలోనూ న్యాయస్థానం వద్ద నుంచి స్టే పొందానని, అప్పీల్ కు వెళ్లడం చేశానని అన్నారు. తనపై రాజ ద్రోహం కేసు నమోదు చేశారని..”వీడో రాజు… నేను ద్రోహం చేశాను” అని సీఎం జగన్ ను ఉద్దేశించి రఘురామకృష్ణ ఎద్దేవా చేశారు.