మారుతి నుంచి రాబోతున్న మినీ టొయోటా వెల్ఫేర్ కారు..!
దేశీయ కార్ల మార్కెట్లో మారుతి సుజుకీ అనేది ఒక సంచలనం. వినియోగదారులు ఏదీ కోరుకుంటే అదే విధంగా మోడళ్లను అందించే సంస్థగా మారుతీ సుజుకి కంపెనీ గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పటి వరకు హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు అన్నీ మోడళ్లను పరిచయం చేసింది ఈ కంపెనీ. ఎప్పటికప్పుడు ఫీచర్స్ ను అప్డేట్ చేస్తూ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోన్న తరుణంలో..ఈ కంపెనీ ఎన్ని కొత్త మోడళ్లు తీసుకొచ్చినా మిడిల్ క్లాస్ పీపుల్స్ ను బేస్ చేసుకొని ధరను నిర్ణయిస్తుంటారు. దీంతో మారుతి కార్లంటే క్రేజ్ బాగా ఎక్కువైంది. ఇప్పుడు అందరూ ఆశ్యర్యపోయేలా ఓ కొత్త మోడల్ ను పరిచయం చేయబోతంది మారుతీ సుజుకి. దీనిని చూసిన వారు మినీ ఇన్నోవానా? లేక మినీ టొయోటా వెల్ఫేరా? అని కామెంట్స్ చేస్తున్నారు. చిన్నపాటి బస్ ను తలపించేలా ఉన్న ఈ మోడల్ విశేషాలు చేస్తే అవాక్కవ్వాల్సిందే..
దీనిపేరు మారుతి సుజుకి స్పేసియా (Spacia) వాహనాన్ని చూస్తే ఏదైనా స్కూల్ వ్యాన్ అనుకుంటారు. కానీ దీనిని మారుతి కంపెనీ కొత్తగా డిజైన్ చేసింది. డిఫరెంట్ లుక్ లో ఆకర్షించే డిజైన్ ను కలిగిన దీనిని ‘మారుతి స్పేసియా ఎంపీవీ’గా పేర్కొంటున్నారు.
ఈ మోడల్ లో చాలా లైట్ వెయిట్ తో కూడిన ఇంజిన్ ఉంటుందట. కొన్ని నివేదికల ప్రకారం మారుతి సుజుకీ, జపాన్ స్పెక్ సుజుకీ కలిసి దీనిని పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందులో 7 సీటర్ తో పాటు బాక్సీ మోడల్ డిజైన్ ఉంటుందట.దీంతో సబ్ 4 మీటర్ల విభాగంలో సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈ కారు పొడవు 3,395 మిల్లీ మీటర్ల పొడవు ఉంటుందట.ఈ మోడల్ లో స్లైడింగ్ డోర్స్ వంటి కొత్త ఫీచర్లను కలిగి.. ఇందులో వైడీబీ అనే కోడ్ పేరును కలిగి ఉంటుందట. ఎంపీవీ కాంపాక్ట్ కలిగిన ఇందులో విశాలమైన స్పేస్ ను కలిగి ఉంటుందట.. ఇంజిన్, తదితర విషయాలు వెల్లడించనప్పటికీ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు కొత్త Z సిరీస్ ను అమర్చే విధంగా ఏర్పాటు చేయనుంది ఈ కంపెనీ. ఇప్పటి వరకు మారుతి ఎంపీవీగా ఎర్టీగా-XL6 కంటే తక్కువ రేంజ్ లో దీనిని తయారు చేయనున్నారట. ఈ మోడల్ పూర్తయిన తరువాత మార్కెట్లో రూ.6.33 లక్షల (ఎక్స్ షోరూం) ప్రారంభ ధరతో విక్రయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది పలు పోటీ వాహనాలకు పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మార్కెట్లో ఇదే ధరతో ఇలాంటి మోడల్ రెనాల్ట్ ట్రైబల్ ఉంది..కానీ దాంతో పోలిస్తే ఇది ఇంకా డిఫరెంట్ లుక్ ఉండనుంది.ఇప్పుడు మారుతి నుంచి ఈ కొత్త మోడల్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు టెక్నికల్ నిపుణులు. అయితే స్టైలిస్ లుక్ తో పాటు సౌకర్యవంతంగా ఉండేందుకు దీనిని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.