చంద్రబాబుకు యావజ్జీవ ఖైదు..?
టీడీపీ అధినేత చంద్రబాబుకు యావజ్జీవ జైలు శిక్ష తప్పదా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ వర్గాలు..వైసీపీ నేతలు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు యావజ్జీవ జైలు శిక్ష తప్పదని జోరుగా ప్రచారం చేస్తోంది.
ఏ లెక్కన చూసినా శిక్ష నుంచి చంద్రబాబు తప్పించుకోలేడని,స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్‌నెట్, అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్, లిక్కర్, ఇసుక స్కాంలు చంద్రబాబు చుట్టుముట్టాయని పోస్టులు పెడుతున్నారు. అన్ని కుంభకోణాల ప్రధాన కుట్రదారు తో పాటు లబ్ధిదారు కూడా ఆయనే అని ఆరోపణలు చేస్తున్నారు.
సెక్షన్ 409 కింద ఒక్కో కేసులో చంద్రబాబుకు యావజ్జీవ ఖైదుకు అవకాశం ఉంటుందట. అవినీతి నిరోధక చట్టం కింద ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. బాబు అవినీతికి వ్యతిరేకంగా ఆధారాలు లేవని కోర్టు చెప్పలేదని పేర్కొంటోన్నారు వైసీపీ నేతలు..అయినా ముందస్తు బెయిల్‌ను ఎల్లో మీడియా వక్రీకరిస్తోందని చెబుతున్నారు. నాడు అధికార దుర్వినియోగం.. యథేచ్ఛగా ప్రజాధనం చంద్రబాబు దోపిడీ చేసాడని.. సీఐడీ దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయని పేర్కొంటున్నారు. డాక్యుమెంటరీ ఆధారాలు.. కీలక సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని జోరుగా ప్రచారం చేస్తున్నారు.. ఎన్నికల ముందు చంద్రబాబుపై పెడుతున్న పోస్ట్‌లు ఏపీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి..