టీడీపీకి గెలుపు కష్టమేనా..? గెలుపుపై అంచనాలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా తారుమారైంది.మొన్నటి వరకూ ఏపీలో అధికారంలోకి ఉన్న వైసీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీతో దోస్తీతో మెలిగింది.అయితే టీడీపీ, జనసేన కూటమిలో ప్రస్తుతం బీజేపీ కూడా చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
సుదీర్ఘకాలంపాటు కొనసాగుతూ వచ్చిన కూటమి పొత్తుల వ్యవహారం కొలిక్కి రావటంతో సీఎం జగన్ను ఢీ కొట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపై నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీల కూటమి కచ్చింతంగా అధికారంలోకి వస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
బీజేపీతో పాటు జనసేనతో కలవడం వల్ల టీడీపీకి పెద్ద నష్టమే వాటిల్లే పరిస్థితి నెలకొందని రాజకీయ పరిశీలకుల మాట. బీజేపీ-జనసేనకు టీడీపీ ఆఫర్ చేసిన సీట్లే దీనికి కారణంగా చెప్తున్నారు. రాష్ట్రంలో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీకి 6 లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించటం టీడీపీ ఉచ్చులో ఇరుక్కునట్లే అని టీడీపీ సీనియర్ నాయకులు సైతం అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల పరిస్థితి ఇప్పుడు అంచనా వేస్తే తప్పులో కలిసినట్లే.కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రం కాబట్టి కేంద్ర సహాయక సహకారాలు అవసరం కాబట్టి అందులో భాగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు.
కానీ 2017లో ఇదే చంద్రబాబు బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేసి కాంగ్రెస్తో చేతులు కలిపి, ఇప్పడు మళ్ళీ ఎన్నికలకు వచ్చే సరికి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు ప్రధాని మోడీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రయోజనాలపై ఎటువంటి హామీ లేకుండానే పొత్తు పెట్టుకోవడం ప్రస్తుతం చంద్రబాబుని ఇరకాటంలో పెట్టే అంశంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకుల మాట..ఇటు తెలుగు తమ్ముళ్ల మదిలో కూడా ఇదే అంశం బలంగా నాటుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఓటు శాతం పెరిగిన జనసేనకు తక్కువ సీట్లు కేటాయించటం..అసలు ఓటింగ్ పర్సెంట్ లేని బీజేపీకి అధిక స్థానాలను కేటాయించడంతో ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారట.దీనిపై బహిరంగంగానే వారు తమ అసంతృప్తిని చూపిస్తున్నారు. తమ నాయకుడు 2014 ఎన్నికల మాదిరిగా పోటీ చేయకుండా, నేరుగా కూటమికి మద్దతు ఇచ్చిన బాగుండని సెటైర్లు వేస్తున్నారు. పైగా 175 స్థానాల నుండి పోటీ చేసి 23 సీట్లు సాధించిన టీడీపీ ప్రస్తుతం జనసేన ఒక్కసీటు కూడా లేని బీజేపీకి కేటాయించిన సీట్లను మినహాయించి మిగిలిన స్థానాల్లో మాత్రమే టీడీపీ పోటీ చేయాలి. ఇలా చేసినా కూడా టీడీపీ 2019 తో పోలిస్తే కాస్త డెవలప్ అయిందనే అనుకుంటే ఎట్టి ఓరిస్థితుల్లో 50 నుండి 70 సీట్లకు మించి గెలవలేదనేది రాజకీయాల విశ్లేషకుల అంచనా..ఇటువంటి క్రమంలో కూటమిలో ఓట్ల బదిలీ సక్రమంగా జరుగుతుందా? అనే అనుమానం అన్నీ పార్టీలోనూ ఉంది. వచ్చే ఎన్నికల ఫలితాల్లో ఏదైనా తేడా వస్తే అది కచ్చితంగా బీజేపీ-జనసేన వళ్లే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.