ఇలా చేస్తే మీ స్పెర్మ్ కౌంట్ హాంఫట్..!
ఆరోగ్యంగా ఉన్న పురుషునిలో 40-300 మిలియన్ల స్పెర్మ్ ఒక మిల్లీలీటర్ వీర్యంలో ఉంటుందని వైద్యుల మాట. అయితే ఈ మధ్యకాలంలో దీని కౌంట్ తగ్గి ఎన్నో జంటలు సంతానలేమి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. స్పెర్మ్ తగ్గడం వలన వృషణాల క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వస్తాయట. అసలు స్పెర్మ్ ఎలా తగ్గుతుంది.. దానికి గల కారణాలు ఏంటి? తెలుసుకుందాం..
మీరు డ్రైవింగ్ లోఈ పొరపాట్లు చేస్తారా..?
చలికాలంలో కార్ డ్రైవింగ్ చేస్తూ చాలామంది కార్ లో హీటర్ని పెట్టుకుంటారు. ఆ వేడి ప్రభావం వృషనాలపై పడి స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుందట. శరీర ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల వరకు ఉంటే మానవ వృషణాలు స్పెర్మ్‌ను ఉత్పత్తి చేసుకోగలదట.అధికంగా ఉండే వేడి స్పెర్మ్‌కు హాని కలిగించి ఉత్పత్తిని తగ్గిస్తుందనేది వైద్యులు చెప్తున్న మాట. అంతే కాదు బిగుతుగా ఉండే లోపల దుస్తులు ధరించి ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయడం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
మీకు ఒత్తిడి ఎక్కువగా ఉందా..?
ఏదన్నా పని విషయంలో, ఇంటి సమస్యలతో చాలా మంది ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అధికంగా ఒత్తిడికి గురయితే స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉన్నాయట. హార్మోన్ స్పెర్మ్ నాణ్యత, ఉత్పత్తి స్థాయి, సామర్థ్యాల పై ఒత్తిడి ఎక్కువగా ప్రభావం చూపిస్తుందట. ఒత్తిడి కారణంగా వృషణాలు కుదించుకు పోయి స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుందట. ఈ మధ్య కాలంలో చాలా మంది పురుషులు ఎదుర్కొనే సమస్యల్లో ప్రధాన సమస్య స్పెర్మ్ కౌంట్ తగ్గడం. పురుషుడి వృషణాలలో అభివృద్ధి అయ్యే పురుష పునరుత్పత్తి కణం స్పెర్మ్.
మీరు రేడియేషన్ లో ఎక్కువగా ఉంటారా..?
స్పెర్మ్ నాణ్యత పై రేడియేషన్ ప్రతికూలంగా పనిచేస్తుందట. మనిషి వృషనాలపై రేడియేషన్ పడడం వలన స్పెర్మ్‌లో శక్తి తగ్గడం, స్పెర్మ్ నాణ్యత తగ్గడం, చలనశీలత తగ్గడం, ఆకారాన్ని మార్చడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ధరించే ప్యాంటు జేబులో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, సెల్ఫోన్లు క్యారీ చేయడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు.
మీ లైఫ్‌స్టైల్ లో మార్పులు తప్పనిసరి..!
ఒక వ్యక్తి లైఫ్‌స్టైల్ ఆ వ్యక్తి స్పెర్మ్ కౌంట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. స్పెర్మ్ కౌంట్‌ను మరియు నాణ్యతను తగ్గిస్తుంది. అందుకే ఎక్కువగా స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకోవద్దని చెబుతుంటారు వైద్యులు.పురుషాంగానికి రక్త సరఫరాను, సెమినల్ ఫ్లూయిడ్ ఉత్పత్తిని మత్తు పదార్థాలు తగ్గిస్తాయట. వయస్సు పెరిగే కొద్దీ స్పెర్మ్ నాణ్యత, పరిమాణం కూడా తగ్గుతుంది.
స్పెర్మ్ కౌంట్ ఎలా పెంచుకోవాలంటే..?
ప్రతీ రోజూ వ్యాయామం చేయడం వలన బాడీలో ఫిట్-నెస్ పెరిగి టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడుతుంది.విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మీ ఆహారంలో విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుందని వైద్యుల అభిప్రాయం.మెంతులు-మెంతికూర తినడం పురుషుల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.