మాల్దీవుల ట్రిప్ పై హీరో నాగార్జున బిగ్ అప్డేట్..!
మాల్దీవుల పర్యటనను టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున క్యాన్సల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కుటుంబంతో కలిసి ఈ నెల 17న మాల్దీవులకు వెళ్లాల్సి ఉందని,కానీ ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధపెట్టాయని అన్నారు నాగార్జున.
150 కోట్ల మందికి మోడీ నాయకుడు..ప్రపంచ దేశాధినేతలు ఆయనకు తగిన గౌరవం ఇస్తారు అన్నారు అక్కినేని నాగార్జున. ప్రధాని మోడీని కించపరిచేలా మాల్దీవుల మంత్రులు మాట్లాడారని, దానికి ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు. లక్షద్వీప్ ఎంతో అందమైన ప్రదేశమని, కుటుంబంతో కలిసి త్వరలోనే అక్కడికి వెళ్తామని నాగార్జున అన్నారు. ఇక మాల్దీవ్స్ ట్రిప్ ను నాగార్జున క్యాన్సిల్ చేయడాన్ని నెటిజన్లు పొగుడుతున్నారు. సెలబ్రిటీలందరూ ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు భారత్ తన వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకెలుతోంది. లక్షద్వీప్ లో మాల్దీవులకు ధీటుగా టూరిజంను డెవలప్ చేయడంపై భారత్ దృష్టి పెట్టింది.