Previous Story
మరోసారి రాజకీయ బరిలోకి గవర్నర్ తమిళిసై..రాజీనామా..!
Posted On 18 Mar 2024
Comment: 0
తెలంగాణ-పుదుచ్చేరి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తమిళసై తమిళనాడు నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం అందుతోంది. చెన్నై సౌత్-తిరునల్వేలి-కన్యాకుమారిలో ఏదో ఒక చోట నుంచి తమిళసై ఎన్నికల బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యక్ష ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తమిళిసై భావిస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో తమిళనాడులోని ఓ పార్లమెంట్ స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత తెలంగాణ గవర్నర్గా నియమించింది కేంద్రం. కానీ, తమిళిసై మాత్రం క్రియాశీలక రాజకీయాలపైనే ఆసక్తి చూపుతోన్నట్టు తెలుస్తోంది.
Subscribe
0 Comments
Oldest