మహిళా ప్రధాని డీప్ ఫేక్ పోర్న్ వీడియోలు..!
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై డీప్‌ఫేక్ వీడియోలు (Deepfake Videos) క్రియేట్ చేశారు కొందరు. ఆ వీడియోలు ఆన్లైన్లో వైరల్ కావటంతో..కేసుపెట్టిన ప్రధాని ఆ కేసులో ప్రధాని జార్జియా లక్ష యూరోల నష్టపరిహారాన్ని కోరినట్లు తెలుస్తోంది.
జార్జియాకు చెందిన డీప్‌ఫేక్ పోర్న్ వీడియోలను ఇద్దరు వ్యక్తులు క్రియేట్ చేసి.. వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. ఆ కేసులో 40 ఏళ్ల వ్యక్తితో పాటు అతని 73 ఏళ్ల తండ్రిని అరెస్టు చేశారు ఇటలీ పోలీసులు.స్మార్ట్‌ఫోన్ ఆధారంగా ఆ ఇద్దరూ వీడియోలను అప్లోడ్ చేశారని, వాళ్లను ట్రాక్ చేసినట్లు ఇటలీ పోలీసులు తెలిపారు. ఇటలీ ప్రధానిగా జార్జియా నియామకం కాకముందే 2022లో ఆ డీప్‌ఫేక్ వీడియోలను క్రియేట్ చేశారని తెలుస్తోంది.
ఇటలీలో నష్టపరిహారం కేసులను నేరాభియోగ కేసులుగా పరిగనిస్తారు.ఆ కేసుల్లో నిందితులకు జైలుశిక్ష కూడా వేస్తారు. జూలై 2వ తేదీన ఈ కేసులో మెలోనీ కోర్టు ముందు హాజరయ్యే అవకాశం ఉంది.అమెరికాలోని పోర్న్ వెబ్సైట్లలో ఆ వీడియోలు అప్లోడ్ అవ్వటంతో పాటు..వాటిని లక్షలాది మంది చూశారని మెలోనీ ఫిర్యాదులో తెలిపారు.మెలోనీ తనకు వచ్చే నష్టపరిహారాన్ని మహిళల సపోర్టు కోసం ఖర్చు చేయనున్నట్లు జార్జీయా లీగల్ టీమ్ తెలిపింది.