వైసీపీలో టికెట్లపై ఉత్కంట..గెలుపు గుర్రాలకే పెద్దపీట..!

ఈ సారి కూడా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న వైసీపీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది..అన్నీ నియోజకవర్గాలలో సర్వేలు నిర్వహించి..నిత్యం ప్రజల్లో ఉండే అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.. ఇదే క్రమంలోనే మూడో జాబితాలో విజయవాడ డివిజన్ పై దృష్టి పెట్టింది వైసీపీ అధిష్టానం..ఒక ఎంపీ సీటుతో పాటు రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు సీఎం జగన్..

టీడీపీకి విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నానిని సిట్టింగ్ స్థానం నుంచే వైసిపి బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది..పెడన అభ్యర్థిగా ఉప్పాల రామున్ని..పెనమలూరు అభ్యర్థిగా జోగి రమేష్ ని..సీఎం జగన్ ఖరారు చేశారు.. కుల సమీకరణాలు లోకల్ రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది..ప్రస్తుతం మంత్రిగా ఉన్న జోగి రమేష్ ముచ్చటగా 3వ నియోజకవర్గంలో ఈసారి బరిలో ఉండబోతున్నారట.. విజయవాడ ఎంపీ స్థానాన్ని మొదట బీసీ లేదా ఎస్సీకి కేటాయించాలని వైసీపీ పెద్దలు అనుకున్నారు.. కానీ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేశినేని నానికి ఈ సీటును కేటాయించింది వైసీపీ అధిష్టానం..

కేశినేని నానికి విజయవాడ టిక్కెట్ ఇవ్వడం వెనుక పెద్ద వ్యూహమే ఉందట.. కేశినేనికి సీటు ఇచ్చి ఇలా చేయటం వెనుక సీఎం జగన్ వ్యూహంతో ముందుకులుతునట్లు తెలుస్తోంది.. ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓట్లను చీల్చే క్రమంలో కేశినేని నానిని బరిలోకి దింపుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.. టిడిపి బలంగా ఉన్న నియోజకవర్గాలపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది.. వైసిపి కొన్నిచోట్ల నియోజకవర్గ ఇన్చార్జిలను సైతం మార్చేసి.. కొత్తవారికి అవకాశం ఇస్తోంది.. ఈ క్రమంలోనే తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్న రక్షణ నిధిని పక్కనపెట్టి టిడిపి నుంచి జంపైన స్వామి దాసుకు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం.. టిడిపికి బలంగా ఉన్న కమ్మ ఓట్ల పైనే వైసిపి ఫోకస్ చేసిందని జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అవగతమవుతోంది..

About the Author
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x