కేంద్రానికి ఈసీ బిగ్ షాక్..వాటిని ఆపేయాలని ఆదేశాలు..!
బీజేపీ ప్రభుత్వానికి ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది.. వాట్సాప్, సోషల్ మీడియాలో వస్తున్న మోదీ వికసిత్ భారత్ ప్రచారాన్ని ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలిచ్చింది.
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం స్వయంగా వికసిత్ భారత్ ప్రచారం నిర్వహిస్తుందని,ముఖ్యంగా వాట్సాప్ ద్వారా ఈ ప్రచారం విపరీతంగా ఉందని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కావటంతో వెంటనే వాట్సాప్ ప్రచారాన్ని బంద్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈసీ.
వాట్సాప్ ద్వారా బీజేపీ ప్రభుత్వం వికసిత్ భారత్ పేరుతో సందేశాలను..వికసిత్ భారత్ గ్రూప్ ను అన్ని ఫోన్లకు పంపించటంతో.. వారం రోజులుగా దేశంలోని ప్రతి ఒక్కరి ఫోన్ లోని వాట్సాప్ కు ఈ సందేశాలు వస్తున్నాయి..వికసిత్ భారత్ పేరుతో మనకు తెలియకుండానే.. మన వాట్సాప్ లోకి వస్తున్న విషయం అందరికీ విధితమే. వికసిత్ భారత్ వాట్సాప్ ప్రచారంలో పలు పార్టీలు ఎన్నికల సంఘానికి కంప్లయింట్ చేటటంతో.. ఈసీ విచారణలో వాస్తవం అని తేలటంతో..2024, మార్చి 21వ తేదీ ఈ మేరకు ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని వీటిని ఆపేయ్యాలని ఆదేశించింది.