మిరప తోటల్లో బూడిద తెగులు పోవాలంటే ఇలా చేయండి..!
కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల మిరపతోటల్లో బూడిద తెగులు ఉధృతంగా వ్యాపిస్తోంది. దీనివల్ల మిరప రైతు తీవ్రంగా నష్టపోతూ అప్పులపాలవుతున్నారు..తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో మిరప పంటలో బూడిద తెగులు సోకినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండో కోతకు సిద్ధంగా ఉన్న తరుణంలో దిగుబడికి నష్టం వాటిల్లకుండా రైతులు సత్వర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వ్యవసాయ అధికారులు..
ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్ట ప్రాంత రైతులకు కల్పతరువుగా మారింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కోతలు కూడా మొదలైన క్రమంలో..పలు జిల్లాల్లో దాదాపు వేలాది హెక్లార్లలో మిర్చి సాగవుతోంది.ఇది మొదటి కోత అయిపోయి, రెండోకోతకు సిద్ధంగా ఉంది.అయితే ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా మిరపకు బూడిద తెగులు ఆశించి రైతులను తీవ్రంగా నష్టపరుస్తోంది. బూడిద తెగులు నివారణ పట్ల రైతులు తగిన శ్రద్ద కనబరిచి తోటలను రక్షించుకోవాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు..
బూడిద తెగులు నివారణ ఎలా చేయాలంటే..?
నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా..
కెరాథేన్ 1 మిల్లి లీటర్ లేదా
అజాక్సీస్ట్రోబిన్ 1 మిల్లీ లీటర్
లీటరు నీటికి కలిపి..10 నుండి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి..