Previous Story
సిఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం..!
Posted On 17 Mar 2024
Comment: 0
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి భారీ ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం వల్ల ఇండిగో విమానం నిలిచిపోయింది . ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ ముంబై పర్యటన ఆలస్యం అయింది. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షి ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలో రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర సభకు తెలంగాణ నుండి వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు గంటపైన వారు శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్నారు.
Subscribe
0 Comments
Oldest