సీఎం జగన్ హెలికాప్టర్ కు తృటిలో తప్పిన ప్రమాదం..అధికారులు సీరియస్..!
కేంద్ర ఎన్నిక సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ లోక్ సభతో పాటు, 4రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, తెలంగాణలోకి కంటోన్మెంట్ పరిధిలోని స్థానానికి ఉపఎన్నికకు షెడ్యూల్ అయ్యాయి.ఈ క్రమంలో దేశంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలకు, నాయకులు, అధికారులు పాటించాల్సిన విధి విధానాలపై రూట్ మ్యాప్ ఇచ్చింది. ఈ క్రమంలో.. ఆయా రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారం జోరందుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 14న అనంతపురం జిల్లాలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి హెలిప్యాడ్ ల్యాండింగ్ అయ్యే సమయంలో ఊహించని ఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 14న అనంతపురం జిల్లాలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి హెలిప్యాడ్ ల్యాండింగ్ అయ్యే సమయంలో ఊహించని ఘటన జరిగింది.ఆ సమయంలో పెద్ద ఎత్తున వచ్చిన గాలికి ఒక చీపురు గాల్లోకి పైకి ఎగిరటంతో..హెలికాప్టర్ ను కొన్నిసెకన్లపాటు గాల్లోపైనే ఉంచాడు పైలట్. అది పైకి ఎగిరి విమానం రెక్కలకు తాకితే ఎలాంటి ప్రమాదం జరిగి ఉండేదోనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా, సీఎం పర్యటన సందర్బంగా అలర్ట్ గా ఉండాల్సిన అధికారులు ఇలా పూర్తిగా నిర్లక్ష్యం వహించడంపై సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దీనిపై విచారణకు ఆదేశించగా.. సీఎం జగన్ మోహన్ తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే.