ఆ తెలుగు కుర్రాడిపై బీసీసీఐ దృష్టి.. ఇతడే హార్థిక్ వారసుడా..?
టీమ్ ఇండియాలో ఆల్ రౌండర్ల కొరత భారీగా ఏర్పడింది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు కూడా మ్యాచ్ లో తేలిపోతే, రెగ్యులర్ బౌలర్లకు భిన్నంగా బౌలింగ్ వేసే వారు కావాలి..అంతేకాదు ఒక పేసర్ కి లయ దొరక్కపోయినా, అతన్ని ప్రత్యర్థులు చితక్కొడుతున్నా, అతని కోటాను వేసే మరో ప్రత్యామ్నాయ బౌలర్ అవసరం. అందుకే ప్రతీ జట్టులో ఒక ఆల్ రౌండర్ ని కావాల్సొస్తుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింటా జట్టుకి ఉపయోగపడేలా చూసుకుంటారు.
ఇప్పుడు టీమ్ ఇండియాలో హార్దిక్ పాండ్యాలేని లోటు టీంని భాదిస్తోంది. ఒకప్పుడు కపిల్ దేవ్ ఉన్నాడు. తర్వాత వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా ధోనీ వచ్చి..ఆ రెండింటి లోటు భర్తీ చేసేశాడు. కానీ బౌలర్ కమ్ బ్యాటర్‌గా రావడానికి హార్దిక్ పాండ్యా రావల్సోచ్చింది. కానీ పాండ్యా తరచూ గాయాల పాలు కావడం జట్టు సమతుల్యత దెబ్బతింటోంది.ఈ క్రమంలో సరైన ఆల్ రౌండర్ కోసం అన్వేషస్తున్న బీసీసీఐకి ఒక 20 ఏళ్ల తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి వారికి కనిపించాడు. అండర్-16 సీజన్లో 1200కిపైగా పరుగులు చేశాడు ఇతడు. తమిళనాడుపై ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు. నాగాలాండ్‌పై 441 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.. హైదరాబాద్ పై 190 పరుగులు చేశాడు నితీష్. ఇలా నితీశ్ అప్పుడే బీసీసీఐ దృష్టిలో పడ్డాడు.
2017-18 సీజన్ లో అండర్-16 విభాగంలో దేశంలోనే బెస్ట్ క్రికెటర్‌కు ఇచ్చే జగన్మోహన్ దాల్మియా అవార్డును నితీశ్‌కు ఇచ్చింది బీసీసీఐ. ఆంధ్రా క్రికెట్ సంఘం తరఫున ఈ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్ గా నితీశ్ కు గొప్ప స్థానం ఉంది.ఇప్పుడిదంతా ఎందుకంటే రంజీ ట్రోఫీలో ముంబై-ఆంధ్రా మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఇక్కడే నితీశ్ పేరు మళ్లీ మార్మోగుతోంది.. ఎందుకంటే తను అంతర్జాతీయ ఆటగాళ్లయిన ఆజ్యింక రహానే, శ్రేయాస్ అయ్యర్ వికెట్లను తీశాడు. వీరితో పాటు ఓపెనర్ జై బిస్టాను అవుట్ చేశాడు నితీష్. అలా తనపై మళ్లీ అందరి ఫోకస్ పడింది.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున నితీశ్ ఆడుతున్నాడు. ఆ జట్టులోనే ఉన్న సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్, భువనేశ్వర్ కుమార్ దగ్గర్నుంచి ఎన్నో మెలకువలు నేర్చుకున్నానని చెబుతున్నాడు నితీష్ కుమార్ రెడ్డి.నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి…కొడుకులోని క్రికెట్ టెక్నిక్ ని పట్టాడు. తనని క్రికెటర్‌గా చేయాలని హిందుస్తాన్ జింక్‌లో మంచి ఉద్యోగాన్ని వదిలేశాడు. అలా 12 ఏళ్ల వయసులో ఉదయపూర్ నుంచి వైజాగ్ వచ్చి క్రికెట్ లో శిక్షణ ఇప్పించాడు. అన్నీ కుదిరితే రేపు టీ 20 వరల్డ్ కప్ సమయాని నితీశ్ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని క్రీడా పండితులు జోస్యం చెబుతున్నారు.