మైనర్ బాలికపై డీఎస్పీ అత్యాచారం..!
పోలీస్ అధికారి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ ) అతనిని అరెస్టు చేసినట్లు గోలాఘాట్ జిల్లా పోలీసులు తెలిపారు.
అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మహిళలకు రక్షణగా నిలబడాల్సిన పోలీసే ఓ మైనర్ బాలికపై (15) అత్యాచారానికి పాల్పడ్డాడు. డిఎస్పీ హోదాలో లచిత్ బోర్ఫుకన్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న సదరు నిందితుడు కిరణ్ నాథ్ బాలికను ఇంట్లో బంధించి అత్యాచారానికి పాల్పడటమే కాక కుటుంబ సభ్యులతో కలిసి చిత్రహింసలకు పాల్పడ్డాడు.. దీంతో బాధితురాలు తో పాటు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో చట్టం కింద అభియోగాలతో పాటు ఐపీసీ సెక్షన్ 376, 506 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు గత రెండు నెలలుగా మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని గోలాఘాట్ ఎస్పీ రాజేన్ సింగ్ తెలిపారు.