ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకులు విడుదల..భారత్ ఎన్నో స్థానమో తెలుసా..?
ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంక్లు గ్లోబల్ ఫైర్ పవర్ విడుదల చేసింది. గ్లోబల్ ఫైర్ పవర్స్ మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్స్-2024 పేరుతో రిపోర్టులు విడుదల చేసారు.మొత్తం 145 దేశాల సైనిక శక్తి సామర్థ్యాలను ర్యాంక్ లుగా మార్చి రిలీజ్ చేసింది గ్లోబల్ ఫైర్ పవర్. సైనికుల సంఖ్య మరియు ఆయుధాలు, ఆర్థిక సుస్థిరత, భౌగోళిక పరిస్థితి ఇంకా వనరులు ఇలా మొత్తం 60కి పైగా అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించింది.
గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్ లో అమెరికా తొలి స్థానంలో ఉండగా భూటాన్ చివరి స్థానంలో ఉంది. రెండో స్థానంలో రష్యా మూడో స్థానంలో చైనా ఉండగా..భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఆర్థిక శక్తి, లాజిస్టికల్ ఎఫీషియెన్సీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్లోబల్ ఫైర్ పవర్ వాస్తవానికి దగ్గరగా ఉన్న రిపోర్టును రిలీజ్ చేసింది.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టాప్ 10 దేశాల జాబితాలో అమెరికా తొలిస్థానంలో ఉండగా.. రష్యా, చైనా, భారత్, సౌత్ కొరియా, యూకే, జపాన్, తుర్కియే, పాకిస్థాన్, ఇటలీ మిగతా స్థానాల్లో వరుసగా ఉన్నాయి. ఇక మిలటరీ శక్తి బలహీనంగా ఉన్న దేశాల్లో మొదటిస్థానంలో భూటాన్ ఉండగా.. మాల్డోవా, సూరినామ్, సోమాలియా, బెనిన్, లైబీరియా, బెలీజ్, సియెర్రా లియోన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఐలాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది గ్లోబల్ ఫైర్ పవర్.