గబ్బిలాల్లో మరో భయంకర వైరస్..!
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాను ‘గబ్బిలాల’ నుంచి సోకినట్లు శాస్త్రవేత్తు తేల్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవే గబ్బిలాల్లో మరో ప్రాణాంతకమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ఇంతవరకు పేరు పెట్టలేదట..కానీ..కరోనా వైరస్ తరహాలోనే ఇది ప్రాణాంతకం కానున్నట్లు తెలుస్తోంది. మానవులకు ఇది సోకితే బ్రతికే అవకాశమే లేనట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ కొత్త వైరస్‌ని ఎకోహెల్త్ అలయన్స్ పరిశోధకులు గుర్తించారు. గతంలో చైనాలోని వూహాన్లో చేసిన ప్రయోగాలతో ముడిపడి ఉన్న పరిశోధన సంస్థ తాజా డెడ్లీ వైరస్‌ని గుర్తించింది. ఇది థాయ్‌లాండ్‌లోని ఒక గుహలో పుట్టినట్లు చెప్తున్నారు శాస్త్రవేత్తలు.
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాను ‘గబ్బిలాల’ నుంచి సోకినట్లు శాస్త్రవేత్తు తేల్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవే గబ్బిలాల్లో మరో ప్రాణాంతకమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ఇంతవరకు పేరు పెట్టలేదట..
ఎకోహెల్త్ అలయన్స్ అధినేత డా.పీటర్ దస్జాక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సమావేశంలో మాట్లాడుతూ.. తాము మునుపెన్నడూ చూడని వైరస్‌ను కనుగొన్నామని అన్నారు. థాయ్‌లాండ్‌లోని స్థానిక రైతులు గబ్బిలాల్లోని మలాన్ని తమ పొలాల్లో ఎరువుగా వేస్తున్నారని.. ఆ మలంలోనే ఈ వైరస్ పారుతోందని అన్నారు. ఈ కొత్త వైరస్ SARS (కరోనా వైరస్)కి దగ్గర సంబంధం కలిగి ఉందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారాయన. మానవులకు సోకే సామర్థ్యం కలిగిన ఈ వైరస్ మానవులకి సోకితే మాత్రం మరింత ప్రమాదాన్ని సృష్టించగలదని హెచ్చరించారు డా.పీటర్ దస్జాక్. థాయ్‌లాండ్ రైతులు తరచూ గబ్బిలాల మలాన్ని ఎరువుగా వాడటం వల్ల అందులోని వైరస్ భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్ని తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డారాయన.
ఇదిలావుండగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో మరింత భయాందోళనలు కల్గిస్తున్నాయి.. ముఖ్యంగా.. జేఎన్.1 సబ్-వేరియంట్ కేసులు ఎక్కువ మోతాదులో నమోదవుతున్నాయి. 50 దేశాల ఆసుపత్రుల్లో కొత్తగా చేరిన వారి సంఖ్య 40 శాతానికి పెరిగినట్లు WHO నివేదించింది. డిసెంబర్ నెలలో దాదాపు 10 మరణాలు నమోదైనట్లు WHO వెల్లడించింది. అయితే.. ఈ కొత్త సబ్-వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ప్రజారోగ్య ప్రమాదాల్ని తక్కువగా కలిగిస్తోందని పేర్కొంది WHO. ఇలాంటి నేపథ్యంలో గబ్బిలాల్లో కనుగొన్న కొత్త డెడ్లీ వైరస్ గురించిన వివరాల్ని ఎకోహెల్త్ అలయన్స్ సంస్థ అధినేత డా.పీటర్ దస్జాక్ వెల్లడించిన సంగతి తెలిసిందే..