తిరుమల వెళ్లే భక్తులకు అలెర్ట్..కలకలం రేపిన డ్రోన్..!
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ ప్రకటించింది టీటీడీ..తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది.. క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకోవచ్చు..ఇదిలా ఉండగా, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో డ్రోన్ కలకలం రేపింది. తిరుమల దేవస్థానంలో మరోసారి నిఘా వైఫల్యం కళ్ళకు కట్టినట్లు కనిపించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ ప్రకటించింది టీటీడీ..తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది.. క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకోవచ్చు..నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 56,588 మంది దర్శించుకోగా, 16,754 మంది తలనీలాలు అర్పించారు. శుక్రవారం ఒక్క రోజే తిరుమల వెంకటేశ్వరుడి హుండీ ఆదాయం రూ. 3.26 కోట్లు వచ్చింది..
ఇదిలా ఉండగా, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో డ్రోన్ కలకలం రేపింది. తిరుమల దేవస్థానంలో మరోసారి నిఘా వైఫల్యం కళ్ళకు కట్టినట్లు కనిపించింది. తిరుమల శ్రీవారి మొదటి ఘాట్ రోడ్డులో భక్తులు డ్రోన్ కెమెరా ఎగురవేశారు. 53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరాతోభక్తులు వీడియోలు చిత్రీకరించారు. ఇప్పటికే తిరుమలలో డ్రోన్లపై నిషేధం ఉంది.. కానీ తిరుమలకు డ్రోన్ తీసుకొచ్చారు భక్తులు. ఇంత జరుగుతున్నా..తిరుమల భద్రతా సిబ్బంది మాత్రం పట్టించుకోక పోవటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.