ఇండిగో పైలెట్ ను చితకబాదిన ప్రయాణికుడు..!
ఇండిగో ఫ్లైట్‌లో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. విమానం ఆలస్యమైందని పైలట్ అనౌన్స్ చేస్తుండగా ఆ విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు కోపంతో ఆ పైలెట్ పై చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది.
ఇండిగో విమానంలో తాజాగా వింత సంఘటన చోటు చేసుకుంది. విమానం ఆలస్యమవుతుందని పైలట్ అనౌన్స్మెంట్ చేస్తున్న సమయంలో ప్రయాణికుడు పైలెట్ పై చేయించుకోవడం చూసి అక్కడున్న వారిని అందరికి షాక్ కి గురి చేసింది..
కొన్ని వార్తా కథనాల కథనాల ప్రకారం.. ఇండిగో విమానం చాలాసేపు ఆలస్యం కావడంతో మునుపటి పైలట్ స్థానంలో మరో పైలట్ బాధ్యతలు వచ్చారు. కాగా ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్స్ నిబంధనల ప్రకారం ఇలాంటి సందర్భాల్లో పైలట్ మార్పు అనేది తప్పనిసరి. బడలిక కారణంగా జరిగే పొరపాట్లు నివారించేలా పైలట్లకు తగినంత విశ్రాంతినిచ్చేందుకు ఈ నిబంధనలను పెట్టారు.ఈ నేపథ్యంలో విమానం ఆలస్యమైన విషయాన్ని ప్రయాణికులకు అనౌన్స్ చేస్తుండగా వెనక కూర్చున్న ఒక ప్రయాణికుడు విమానం ఆలస్యం ఎందుకు అవుతుందని కోపానికి గురయ్యారు. దాంతో ఒక్కసారిగా వచ్చి కోపంతో పైలట్‌పై చేయి చేసుకున్నాడు. ఈ దృశ్యం చూసి విమానం లో ఉన్న ప్రయాణికులు అతడిని అడ్డుకున్నారు.
కాగా ప్రయాణికుడి దురుసు ప్రవర్తనను నెటిజన్లు స్పందిస్తున్నారు. పైలెట్స్ కూడా మనలాంటి మనుషులే కదా..అలా వారి పైన చేయి చేసుకోవడం సరైనది కాదని కామెంట్లు పెడుతున్నారు. ఫ్లైట్ ఆలస్యంలో పైలట్ తప్పేముందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
పైలట్ తన బాధ్యత మాత్రమే నిర్వహిస్తున్నడు.. కాబట్టి అతనిపై చేయి చేసుకుంటే తప్పు మనదే అవుతుందని చెయ్యి చేసుకున్న ప్రయాణికుడి పై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రయాణికులకు మరోసారి విమానం ప్రయాణానికి అనుమతించకుండా నో ఫ్లై లిస్టులో చేర్చాలని, అతడిని అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.