చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు..ధర ఏకంగా రూ.7లక్షల పైనే..!
చెట్లకు పండ్లను, కూరగాయలను, పూలను పండించడం చూశాం కానీ ఇలా చెట్లకే కుర్చీలను పండించడం గురించి ఎక్కడైనా చూశారా.? ఎక్కడైనా చెట్లను పెంచి వాటిని కట్ చేసి కుర్చీలను తయారు చేస్తారు.కానీ ఏకంగా ఓ పండు మాదిరిగా కుర్చీలను చెట్లకు పండించటం ఏమిటీ..
ఓ పండు మాదిరిగా కుర్చీలను చెట్లకు పండించటం ఏమిటీ..? విడ్డురం కాకపోతే? అసలు అదెలా సాధ్యం? అనుకుంటే పప్పులో కలిసినట్లే..అవును ఇది నిజం..ఓ రైతు ఈ వినూత్న ఆలోచనతో పెద్ద వ్యాపారమే చేస్తున్నాడు. లక్షల్లో లాభలు కూడా ఆర్జిస్తున్నాడు. అదెలాగో మీరే చూడండి.
యునైటెడ్ కింగ్డం (UK) కి చెందిన గావిన్, ఆలిస్ మున్రో జంట ఈ వినూత్న వ్యవసాయాన్ని చేస్తున్నారు. ఇద్దరు ఫర్నీచర్ ఫామ్‌ని చేస్తున్నారు. వారు తమ పొలంలో కుర్చీల్లా ఎదిగేలా చెట్లను పెంచుతూ.. ఫర్నీచర్ కోసం పరిపక్వానికి వచ్చిన చెట్లను నరికేసి భారీగా కార్బన్ ఉద్గారాలు పెరిగే ప్రమాదం నుండి కాపాడుతున్నారు. ఒక చెట్టును యాభై ఏళ్లపాటు పెంచి దాన్ని నరికి కుర్చీగా తయారు చేసే బదులు చెట్లకే నేరుగా కావాల్సిన ఆకృతిలో కుర్చీలను పెంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది ఈ రైతుకి.. అనుకున్నదే తడువుగా ఇద్దరు దంపతులు ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
దీన్ని గావిన్ ఒక రకమైన జెన్ త్రీడీ ప్రింటింగ్ అంటారని చెప్పుకొచ్చాడు. గావిన్ కు ఈ ఆలోచన తాను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడూ కుర్చీలా ఉండే బోన్సాయ్ చెట్లను చూసి ఆలోచన వచ్చిందని చెప్పాడు. అదీగాక గావిన్ చిన్నతనంలో వంగిన వెన్నుపూసతో జన్మించటం వల్ల చాలా కాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందట. అక్కడ వైద్యులు వెన్నుని సరిచేసే నిమిత్తం మెటల్ ఫ్రేమ్‌ని అమర్చారట. దాంతోనే చాలా ఏళ్లు గడిపాడ గావిన్. అప్పుడే గావిన్కి తెలిసింది..ఏదైన సరైన ఆకృతిలో రావాలంటే పెరుగుతున్న క్రమంలోనే ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందని..ఆ తర్వాత గావిన్ తన ఆలోచనకు రూపమిచ్చే పనిలో పడ్డాడు. అందుకోసం విల్లో అనే ప్రత్యేకమైన చెట్లును ఉపయోగించాడట. విల్లో చెట్టు కొమ్మలు చాలా సరళంగా ఉంటాయి. అదేవిధంగా, ఓక్, యాష్, సైకమోర్ వంటి బలమైన తీగలు ఉన్న చెట్లను కూడా ఫర్నిచర్ తయారీకి ఊయోగిస్తారు. చెట్ల తీగలను కుర్చీలుగా మార్చడానికి గావిన్ ఇనుప ఫ్రేమ్‌లను ఉపయోగించి, ఈ ఫ్రేమ్‌ల లోపల చెక్క కుర్చీని అమర్చి పెంచటం వల్ల,కుర్చీల ఆకారం చెడిపోకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది..ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చెట్టు కత్తిరిస్తాడు గావిన్.. అయితే ఒక్కో కుర్చి ఖరీదు మాత్రం రూ. 6 నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారు గావిన్ దంపతులు..
ఈ క్రమంలో ఈ దంపతులు చెట్ల పెరుగుదలకు అడ్డురాకుండా మంచి ఆకృతిలో పెంచేందుకు కొత్త మార్గాన్ని కూడా కనుగొనవల్సి వచ్చింది. ఈ సేంద్రీయ మొక్కలను పెంచడానికి చాలా శ్రమ, సమయంల ఖర్చు అవుతుందని చెబుతున్నాడు గావిన్. ఈ మొక్కల పెంపకంలో గావిన్ భార్య ఆలిస్ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇలా ఈ దంపతులు 2012లో ఫుల్-గ్రోన్ అనే కంపెనీ స్థాపించారు. అంతేగాదు ఒక కుర్చీ పెరగడానికి 6 నుడి 9 సంవత్సరాలు పట్టగా ఎండడానికి ఒక సంవత్సరం పడుతుంది.
అంటే ఒక కుర్చీ తయారవ్వడానకి ఇంచుమించు 7 నుంచి 10ఏళ్ళు పట్టొచ్చు. పైగా ధర కూడా లక్షల్లో ఉంటుంది. చెట్లకు కుర్చీలనే పెంచడమే ఒక వింత అనుకుంటే వాటిని ఇన్ని లక్షలు పోసి కొనడం మరింత విడ్డూరంగా ఉంది కదా!.అంతేగాదు గావిస్ ఆలిన్ ఇంత సమయం పట్టకుండా ఉండేలా ఏటా పండించేలా చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. 2024 కల్లా ఆ లక్ష్యం నెరవేరగా దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఆ గావిన్ ఆలిస్ దంపతులు.