Previous Story
టీడీపీ-జనసేన కూటమికి 130-155 సీట్లు పక్కా..?
Posted On 17 Jan 2024
Comment: 0
రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి 130-155 సీట్లు పక్కా రాసిపెట్టుకోండి అంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భీమవరం మండలం రాయలం గ్రామంలో టీడీపీ, జనసేన నాయకులతో ఆయన ఆత్మీయ సమావేశంలో ఎంపీ రఘురామ మాట్లాడుతూ..వైస్ షర్మిల కాంగ్రెస్ నుంచి బరలోకి దిగితే.. వైసీపీ ఓట్లు చీలుతాయన్నారు. సుప్రీం కోర్టులో 17A విషయంలో ద్విసభ్య ధర్మాసనం తీర్పును తప్పుబడుతూ కొన్ని పేపర్లు అవాస్తవాలను ప్రచురించడం బాధాకరమని ఎంపీ రఘురామ అన్నారు. ఏది ఏమైనా కొత్త ప్రభుత్వంలోనే 17Aపై విచారణ జరుగుతుందని జోస్యం చెప్పారు రఘురామ. రాష్ట్రంలో జగన్ ప్రజా వ్యతిరేక పాలన పట్ల జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారాయన..నాలుగేళ్ల సుధీర్ఘ విరామం తరువాత సొంత రాష్ట్రానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు రఘురామ.
Subscribe
0 Comments
Oldest