తనకు మరో పెళ్లి కోసం ఎదురుచూస్తున్న 112ఏళ్ల బామ్మ..!
మలేషియాకు చెందిన 112ఏళ్ల ఓ బామ్మ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ బామ్మ వయసు జస్ట్ 112 ఏళ్లు కానీ ఆమెకు పెళ్లి కావాలట. ఆమె తన చివరి దశలో వెల్లడించిన కోరికను విని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. బామ్మ అలా పెళ్లికావాలనిందో లేదో వెంటనే ఓ అబ్బాయి ముందుకు వచ్చి ప్రపోజ్ చేసేసాడు..
బామ్మ అలా పెళ్లికావాలనిందో లేదో వెంటనే ఓ అబ్బాయి ముందుకు వచ్చి ప్రపోజ్ చేసేసాడు.. 112ఏళ్ల ఓ బామ్మ తనను పెళ్లి చేసుకుంటానని బట్..ఒక కండిషన్ అంటూ వృద్ధురాలు ఓ కండిషన్ పెట్టింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ఈ పెళ్లి జరిగితే ఈమెది ఇది ఎనిమిదో పెళ్లి.సితి హవా హుస్సేన్ అనే ఈ వృద్ధురాలు మలేషియాలోని కెలాంతన్లో తుంపట్ నగర నివాసి. ఆమె 7సార్లు వివాహం చేసుకుంది. ఇప్పుడు ఈ వృద్ధురాలు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉన్నట్లు తెలిపింది..
ఈమె చిన్న కొడుకుకు 58 ఏళ్లు..!
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..హవా హుస్సేన్‌కి పిల్లలున్నారు.మొత్తంగా ఆమెకు 19 మంది మనవళ్లు, 30 మంది మనవరాళ్లు ఉన్నారు. ఆమె చిన్న కుమారుడు అలీ వయస్సే 58 సంవత్సరాలట.
పెళ్లి చేసుకోవాలంటే ఓ కండీషన్ పెట్టిన బామ్మ..!
వృద్ధురాలు తన భర్తల్లో కొందరు చనిపోయారని..మరికొందరితో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత విడిపోయారని చెప్పింది. హవా హుస్సేన్ తన 8వ పెళ్లి కోరికను వ్యక్తం చేస్తూ ఒక షరతు పెట్టింది. తనకు ఎవరైనా ప్రపోజ్ చేస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
సుదీర్ఘ జీవిత రహస్యం చెప్పిన బామ్మ..!
హవా హుస్సేన్ తన సుదీర్ఘ జీవిత రహస్యాన్ని చెప్పింది. ఆమె సాధారణ ఆహారాన్ని మాత్రమే తింటుంది. మంచి ఆహారపు అలవాట్లతో పాటు, ఆమె దీర్ఘాయువు కోసం ప్రార్థనలు చేస్తుంది. రోజుకు 5సార్లు నమాజ్ చేస్తుందట..